నాణ్యమైన చికిత్సను అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలి..




సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..


 పొదలకూరు మేజర్ న్యూస్..



సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన వైద్య అధికారులతో మాట్లాడుతూ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన చికిత్సను అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పొదలకూరు చుట్టూ ఉన్న ఐదు మండలాల ప్రజలు డయాలసిస్ కు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అందుకు రోగులకు ఖర్చు కూడా అధికం అవుతుందని అందుకు తగ్గట్టుగా పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు..డయాలసిస్ సెంటర్ కు అదనంగా భవనాలు కావాలని వాటిని ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష చేసి భవనాలు నిర్మాణాన్నికి చర్యలు తీసుకొని అధునాతనమైన సాంకేతిక పరికరాలను  అందుబాటులోకి తెచ్చి  ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ సుదూర ప్రాంతాలకు  వెళ్లే అవసరం లేకుండా అవసరమైన అన్ని వసతుల తో కూడిన చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే మహ్మదాపురంలో  విద్యాశాల భవనం సంగంలో అసంపూర్తిగా వదిలేశారని..కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక అర్దరాంతంగా పనులు నిలిచిపోయాయని అధికారులతో మాట్లాడి వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు..సర్వేపల్లి నియోజవర్గాల్లో హెల్త్ పరంగా ఏమేమి కావాలో వాటి పై ఆరోగ్య శాఖ మంత్రి వద్ద సమీక్ష చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున్ నాయుడు, వెంకటేశ్వర్లు నాయుడు, రత్నం నాయుడు, బోగోల భాస్కర్ రెడ్డి, ఆదాల సుగుణమ్మ, పెంపులూరు అరుణ, ఆదాల మురళి రెడ్డి, మళ్లీ యాదవ్, సుధీర్, జమీర్ భాష, తదితరులు పాల్గొన్నారు.