పాటిమిట్ట గిరిజనులకు న్యాయం చేయండి

చిట్టమూరు మండలం యాకసిరి పాటిమిట్ట గిరిజన రైతులకు న్యాయం చేయాలని మండల తహసీల్దార్ విజయలక్ష్మి కి అర్జీ సమర్పించారు ఆ గ్రామ పేదరైతులు. సర్వే నెంబర్ 425 లోని ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన గిరిజన, దళితులు వెనుకబడిన తరగతులకు చెందిన నిరుపేదలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతమంది కి ప్రభుత్వం పట్టాలును సైతం ఇచ్చిఉంది. అయితే ఏడాదికి ఒక్క ఒక్కపంట మాత్రమే పండుతుంది. అదికూడా యల్ది పైరు మాత్రమే.అయితే ఈ భూములలో కొంత మేర మెట్టభూమి ఉండడంతో.. తెలుగుగంగా సాగునీరు అందుబాటులో ఉన్నా సాగు నీరు పారడం లేదు. ఇంజన్లను పెట్టి సాగునీరు తోలుకుంటున్నారు. ఎలదిపైరులో  ఆదాయలు   రాక ఇబ్బంది పడుతుంటే... మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఇంజన్ డీజిల్ కుకూడా ఇబ్బంది పడుతూ... పంటలు ఎండిపోతున్నాయి. మెట్టభూమిలో ఒక్క అడుగు మేర మట్టి తొలగించుకుంటే సాగునీరు అందుబాటులోకి వస్తుందని రైతులు తహసీల్దార్ కు మోరపెట్టుకున్నారు.రైతులు మట్టి తొలగించుకునేందుకు అనుమతులు మంజూరు చేసి న్యాయం చేకూర్చాలని కోరుతున్నారు.