జిల్లా వాసి “అమరజీవి” శ్రీ పొట్టి శ్రీరాములు  జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా యస్.పి.  విజయ రావు

   తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి    అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు  చేసిన కృషి, దీక్ష ఫలితమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.    ఇలాంటి దృడ సంకల్పం ఉన్న గొప్ప వ్యక్తి జన్మించిన స్థలంలో మనందరం విధులు నిర్వహించడం సంతోషంగా ఉంది..     శ్రీ పొట్టిశ్రీరాములు  త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుంది.    ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే పొట్టిశ్రీరాములు     అమరజీవి పొట్టి శ్రీరాములు  జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం.    ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకున్న గొప్ప త్యాగమూర్తి.    శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని, స్మృతులు, సేవలను స్మరించుకున్న జిల్లా పోలీసు అధికారులు.    ఉదయం 11.00 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా యస్.పి. తో పాటు  అడిషనల్ యస్.పి.(అడ్మిన్), యస్.బి. డి.యస్.పి., ఏఆర్ డి.యస్.పి., ఏఓ, ఆర్ ఐ లు,  ఇతర డీపీవో అధికారులు, సిబ్బంది పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు.