మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన 181 హెల్ప్ లైస్ ను విరివిగా ఉపయోగించుకోవాలి 
వస్ స్టాప్ సెంటర్ (సఖి) సేవలు జిల్లా ప్రజలకు మరింత చేరువ కావాలి 
దిశ చట్టంపై గ్రామ/వార్డు స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలి
నెల్లూరు, జనవరి09, (రవికిరణాలు) : జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ఆద్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో వస్ స్టాప్ సెంటర్ (సఖి) కార్యకలాపాలు మరియు దిశ యాక్ట్ అమలు అమలు గురించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరిలో మంచి అవగాహన పెంపొందించే విధంగా సంబందిత అధికారులు తీసుకోవాల్సిన చర్యలు అనుసరించాల్సిన విధి విధానాల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా యస్పి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అధారిటీ, ఐసిడిఎస్‌ డిపార్టుమెంటు, ఉమెన్ అండ్ చైల్డ్ డవలప్మెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మహిళా పోలీస్ స్టేషన్, టైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిఆర్‌డిఏ, ఎన్‌జిఓఎస్‌ మొదలగు
విభాగాల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వస్ స్టాప్ సెంటర్ (సఖి) సేవలు జిల్లాలో ప్రజాలందరికీ మరింత చేరువ కావాలని, దిశ చట్టంపై గ్రామ/వార్డు స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలి అని తెలిపారు. అదేవిధంగా దిశ యాక్ట్ పగడ్భందీగా అమలు పరచడానికి, ఓఎస్‌సి (సఖి) సేవలు మరింత విస్తృతం చేయడానికి కావల్సిన వాహనాలు, సిబ్బంది, మౌలిక సదుపాయాల గురించి యాక్షన్ ప్లాన్ గురించి ఈ సమీక్షా సమావేశంలో చర్చించడం జరిగింది. ఇంకా ఈ సమీక్షలో అన్ని శాఖల సిబ్బందితో పాటు గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శిలను (మహిళా పోలీసు అధికారులు) ఉపయోగిచుకొని దిశ
చట్టం, ఓఎస్‌సి(సఖి) సేవలపై ఏవిధంగా గ్రామ మండల డివిజన్ మరియు జిల్లా స్థాయిలలో అవగాహన సదస్సులు నిర్వహించి మంచి ఫలితాలు రాబట్టాలనే అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యస్పితో పాటు అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) పి.మనోహర్ రావు, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అధారిటీ సుధా రాణి, ఉమెస్ పిఎస్‌ డిఎస్పి శ్రీధర్, ఎస్సీ/ఎస్టీ సెల్ డియస్పి లక్ష్మీ నారయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటిడిఏ మణికుమార్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా భారతి, ఏపిడి శేషకుమారి, ఓఎస్‌సి అడ్మిస్ ఎస్‌.సహనాస్, పారా లీగల్ జోష్న, కేసు వర్కర్ నగ్మా, కౌన్సెలర్ కుమారి కమల మొదలగు వారు పాల్గొన్నారు.