DG గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు..




వెల్ఫేర్ డే సందర్భంగా భద్రత లోనుల పరిమితిని పెంచిన గౌరవ DG గారు..  పోలీసుల సంక్షేమమే నా ప్రధమ కర్తవ్యం... మనమంతా ఒకే కుటుంబం..  ప్రతి జిల్లాలో సిబ్బంది సంక్షేమం కొరకు వారానికి ఒక రోజును కేటాయించాలని ఆదేశం..  కోవిడ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియని సమయంలో కింది స్థాయి నుండి ఉన్నతాధికారి వరకు రోడ్లపై నిలబడి సమాజ సేవ చేసారు.. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు.. కోవిడ్ కారణంగా మరణించిన పోలీసుల సేవలు చిరస్మరణీయం..  కమిటీ నిర్ణయం మేరకు లోనులు పరిమితి పెంచి, వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది.. DG గారు..  భద్రతలో పర్సనల్, మ్యారేజ్, ఎడుకేషనల్ తదితర అన్ని లోనులు పరిమితి పెంచాం.. వినియోగించుకోండి..

 తేది.29.09.2021 న రాష్ట్ర డిజిపి గౌరవ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారు భద్రత లోనుల పరిమితిని పెంచడం, వడ్డీ రేట్లను తగ్గింపుపై రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల యొక్క యస్.పి.లతో, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ DG గారు మాట్లాడతూ రాష్ట్ర పోలీసుల సంక్షేమంలో భాగంగా భద్రత స్కీం ద్వారా  పోలీసులకు ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచడం... ఆ రుణాలకు వడ్డీ ధరలు తగ్గించడంపై చర్చ సాగింది. త్వరలో దీన్ని అమలు పరచనున్నట్లు డిజిపి గారు వెల్లడించారు. భద్రత మరియు ఆరోగ్య భద్రత క్రింద తీసుకొనివచ్చిన నూతన పాలసీలు, ప్రస్తుతం అమలులో ఉన్న గృహ, విద్య, వ్యక్తిగత రుణాల పరిమితి పెంచడం తదితర అంశాలపై యూనిట్ అధికారులతో చర్చించారు. అదేవిధంగా వారంలో ఒక రోజు “వెల్ఫేర్ డే” గా పాటించాలని, తద్వారా పోలీసు సిబ్బంది యొక్క సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని, కోవిడ్ సంబంధిత సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాలని జిల్లా యూనిట్ అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా యస.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం,  యస్.బి. డి.యస్.పి. శ్రీ కోటా రెడ్డి, SB CI-1 శ్రీ అక్కేశ్వరరావు, CI-2 శ్రీ రామకృష్ణ, DPO AO, పి.సూపరింటెండెంట్, DPO సిబ్బంది, పోలీసు అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.