బుధవారం జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా పోలీసు కార్యాలయంలో నగరంలోని ట్రాఫిక్ డివిజన్ లోని అధికారులతో సమవేశమై పై వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలో సురక్షిత మరియు ప్రమాద రహిత ప్రయాణం, ట్రాఫిక్ రద్దీ గురించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ పరంగా పలు చర్యలు చేపట్టి, ట్రాఫిక్ సవాళ్లను అధిగమించేందుకు పరిస్థితులు పూర్తిగా అధ్యయనం చేసి, నగరంలోని ట్రాఫిక్ పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా నియంత్రించాలని సంకల్పించి ఈ సమీక్ష సమావేశం నిర్వహించి, సిబ్బంది కొరత లేదా ఎటువంటి మౌళిక సదుపాయాలు అవసరమైన వెంటనే తెలపాలని, సత్వరం వాటిని పరిష్కరిస్తానని ఆదేశించారు. నెల్లూరు నగర జనాభా పెరుగుదల, వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వలసలు, వాణిజ్య ప్రాంతం కావడం వలన నిత్యం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు రాకపోకలు, విద్యాసంస్థల కేంద్రంగా ఉండటం తదితర కారణాల వల్ల ట్రాఫిక్ నిర్వహణ అంశం ఒక సవాలుగా పరిగణించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ట్రాఫిక్ సమస్య నియంత్రించడం జరుగుతుందని, నెల్లూరు జిల్లాలో అవగాహనా లోపం, అధిక వేగం, వ్యతిరేక దిశలో ప్రయాణం, లైసెన్స్ లేకుండా వాహనం నడపటం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ టేకింగ్, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టక పోవడం వల్ల కలిగే రహదారి ప్రమాదాలు, రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు, ముందస్తు భద్రతా చర్యల గురించి ట్రాఫిక్ పోలీస్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లు కలిసి విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కలిగించాలని, అదేవిధంగా ఆటోలో ప్రయాణికులను, స్కూల్ పిల్లల ను పరిమితికి మించి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్ లు కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని, నగరానికి ప్రధానంగా వచ్చే ప్రయాణికుల పట్ల గౌరవంగా బాధ్యత వహించి ఆటోడ్రైవర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా ఆదర్శంగా నిలవాలని, ఖాకీయూనిఫాం ధరించాలని ఆటో లో ఎవరైనా ప్రయాణికులు వారి బ్యాగ్ లు లేదా ఇతర ఎటువంటి వస్తువులు వదిలి వెలితే వెంటనే సమీపంలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి అందజేయాలని ఆటో డ్రైవర్లకు యూనియన్ వారికి కొన్ని సూచనలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పితో పాటు ట్రాఫిక్ డియస్పి పి.మల్లికార్జున రావు, ట్రాఫిక్ సి.ఐ. ఆంజనేయ రెడ్డి, యస్.ఐ. తిరుపతి, డి.సి.ఆర్.బి. యస్.ఐ. సాంబ శివరావు అధికారులు పాల్గొన్నారు.