బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పి
జిల్లాలో సోమవారం నుండి పర్యటించనున్న గౌరవ ఉపరాష్ట్రపతి
ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా రాక
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో సన్నద్ధమవుతున్న జిల్లా పోలీసు యంత్రాంగం
నెల్లూరు, జనవరి 18, (రవికిరణాలు) : ఈనెల 20వ తేది నుండి మూడు రోజులు పాటు జరగనున్న గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటనలో భాగంగా జిల్లాకు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గౌరవ విశ్వభూషణ్ హరిచందన్, ప్రముఖులు కూడా వస్తున్న సందర్భంలో ఏర్పాటు చేయబడ్డ పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల సన్నద్ధం గురించి జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ పోలీసు అధికారులకు జిల్లా పోలీసు కార్యాలయం నందు గల మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పూర్తి స్థాయి బందోబస్త్ బ్రీఫింగ్ నిర్వహించడం జరిగింది. గౌరవ ఉపరాష్ట్రపతి 20.01.2020 న ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక రైల్ లో బయలు దేరి ఉదయం 11 గంటలకు వెంకటాచలం స్టేషన్, అక్కడ నుండి స్వర్ణభారతి ట్రస్ట్ కు చేరుకొని, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలలో పాల్గొని, రాత్రికి స్వర్ణభారతి ట్రస్ట్ లో బస చేయనున్నారని, తిరిగి 21వ తేది ఉదయం గౌరవ గవర్నర్, ప్రముఖులతో కలిసి సరస్వతి నగర్ లోని దీనదయాల్ అంత్యోదయ భవన్ లోని కార్యక్రమాలు, మధ్యాహ్నం నుండి నెల్లూర్ టౌన్ లోని కస్తూర్భా కళాక్షేత్రంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొని, రాత్రికి తిరిగి స్వర్ణభారతి ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు తిలకించి, రాత్రికి అక్కడే బస చేస్తారని, తిరిగి 22.01.2020న వెంకటాచలం రైల్వే స్టేషన్ నుండి చెన్నై కు బయలుదేరుతారని తెలిపారు. ఈ సందర్భంగా యస్పి మాట్లాడుతూ ఈసారి గౌరవ ఉపరాష్ట్రపతి, గౌరవ గవర్నర్, ప్రముఖుల పర్యటన డైనమిక్ గా ఉంటుంది అని అందుకు తగ్గట్టుగా, వివిఐపి కాన్వాయ్ లు, కంటిన్ జెంట్ ప్లాన్ తో పాటు 2అడిషనల్ ఎస్పి, 06డిఎస్పి, 19సిఐ, 55ఎస్‌ఐ, 125-ఏఎస్‌ఐ/హెచ్‌సి, 456-పిసి, 50-ఉమెన్ ఏఎస్‌ఐ/హెచ్‌సి/పిసి, 65-హెచ్‌జి, 6-స్పెషల్ పార్టీలతో బందోబస్త్ కూర్పు చేసి, ప్రధానంగా ట్రాఫిక్ కాంపోనెంట్ తో పాటు అన్ని సెక్టార్ లు పటిష్టం చేయడం జరిగింది అని తదనుగుణంగా కల్వర్ట్ చెకింగ్, బాంబ్ మరియు డాగ్ స్క్వాడ్ లతో యాంటీ సబోటేజ్ చెకింగ్, ఆర్.ఒ.పి., కూంబింగ్ లు క్షుణ్ణంగా నిర్వహించాలని, వ్యతిరేఖ దిశలో వాహనాల కదలికలు పూర్తిగా నిరోధించాలని, వి.వి.ఐ.పి. లు బస చేసే ప్రదేశాలను వంద శాతం స్టెరైల్ చెయ్యాలని ఆదేశాలు జారీచేసారు. అదేవిధంగా హెలిపాడ్స్, ఉపరాష్ట్రపతి గారి రాత్రి బస, స్టాటిక్, పార్కింగ్ ఏరియాలు, రూట్ టాప్స్, సన్మాన సభలు, శంకుస్థాపనలు జరిగే ప్రదేశాలలో బందోబస్త్ నిర్వహించే సిబ్బంది డి.యఫ్.యం.డి., హెచ్.యం.డి. లతో పూర్తి స్టాయి యాక్సెస్ కంట్రోల్ తో విధులు పూర్తి నిబద్దతతో నిర్వహించాలని, బందోబస్త్ లో భాగంగా విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరు ఐడి కార్డు, డ్యూటీ పాస్ క్యారీ చేయాలని, మీడియా ఎంక్లోజర్స్ ఏర్పాటు చేయాలని, అతిథులు, విద్యార్థులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బందోబస్త్ విజయవంతం చేయాలని అధికారులకు పూర్తి స్థాయి బ్రీఫింగ్ నిర్వహించారు. రేపు సాయంత్రం 04.00. గంటలకు వివిఐపి ల పర్యటన ప్రదేశాలలో పూర్తి స్థాయి ట్రయిల్ రన్ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ బ్రీఫింగ్ కార్యక్రమంలో ఆడిషనల్ యస్.పి.(క్రైమ్స్), (ఎ.ఆర్), అందరూ డియస్పి లు, ఇన్స్పెక్టర్ లు, ట్రాఫిక్, ఎమ్‌టిఒ, సబ్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.