నేడే సామాజిక పింఛన్ల పంపిణీ
నేడే సామాజిక పింఛన్ల పంపిణీ
రాపూరు మేజర్ న్యూస్
డిసెంబర్ ఒకటి ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే నవంబరు 30 నే ఒక రోజు ముందు గానే పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఎంపిడీఓ భవానీ తెలిపారు.గత నెలలో పింఛను తీసుకోని వారికి ఈ నెలలో రెండూ కలిపి ఇవ్వడం జరుగుతుందన్నారు.రాపూరు మండలంలో కేవలం ఆరుగురు మాత్రమే గత నెలలో పింఛను తీసుకోలేదని వారికి ఈ నెలలో కలిపి ఇవ్వడం జరుగుతుందన్నారు. శనివారం తీసుకోలేని వారు ఆందోళన చెందాల్సిన పని లేదని సోమ,మంగళవారాల్లో యధావిధి గా పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు.