ప్రతిష్టాత్మకంగా జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీ
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం కమ్యూనిటీ సెంటర్ నందు జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.వేలాదిగా విద్యార్థులు, తల్లితండ్రులు తరలివచ్చారు.అనంతరం విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కార్డులను ఎమ్మెల్యే కాకాణి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు, తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
గతంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బిడ్డలను ఉన్నత చదువులు చదివించే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పధకాన్ని మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు.ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్ పధకాన్ని పట్టించుకోలేదు.గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఫీజులు కట్టుకోలేక ఎంతో మంది విద్యకు దూరమైన పరిస్థితి.
తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకోమని అనుమతులు ఇవ్వడంతో
పేదలకు విద్య అందని పరిస్థితి.జగన్మోహన్ రెడ్డి ద్వారా తిరిగి మహానేత పాలన రావడంతో విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను కొందరు విమర్శలతో హేళన చేశారు.
హేళన చేసిన వారు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారో చెప్పాలి!.ఈ కార్యక్రమంతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి కి నా ప్రత్యేక ధన్యవాదాలు.సర్వేపల్లి నియోజకవర్గములోనే 8260 మంది విద్యార్థుల కుటుంబాలకు జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ది చేకూరుతుంది.అన్ని వర్గాలకు సంబంధించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు.
చంద్రబాబు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఇచ్చినా, ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందించే బాధ్యత నాది.అమ్మ ఒడి పథకాన్ని అర్హులైన వారందరికీ అందజేస్తాము.చిన్నపాటి సాంకేతిక సమస్యలున్న పరిష్కరించి, అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి పధకాలు అందిస్తాము.విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏకాగ్రతతో సాధించాలి.విద్యార్థులకు తమ గమ్యాన్ని సాధించుకునేందుకు క్రమశిక్షణ, పట్టుదల చాలా ముఖ్యం.విద్యార్థులు తల్లి తండ్రులతో మంచి నడవడికతో మెలగాలి.విద్యార్థులు తమ తల్లితండ్రులు గర్వపడే విధంగా ఎదగాలి.జన్మనిచ్చిన తల్లితండ్రులు రుణం తీర్చుకోవాలంటే, ఉన్నత స్థాయికి ఎదిగి, తల్లితండ్రులకు మంచి గుర్తింపు తేవాలి.మీ ద్వారా మీ తల్లితండ్రులకు మంచిపేరు వస్తే అంతకంటే వారి రుణం తీర్చుకునే అవకాశం ఇంకొక్కటి ఉండదు. భగవంతుడు నాకు అవకాశం ఇస్తే, నేను ఎమ్మెల్యే పదవిని వదిలి విద్యార్ధి దశను కోరుకుంటాను.
విద్యను నేర్చుకుంటే జీవిత కాలం మీవెంటే ఉంటుంది.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి.మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేలా మీరందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి కోరారు.