నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు వితరణ.
నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు వితరణ.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
కాళ్లంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తుల కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణ ముఖ ఖాళీ శ్రీ చెంగాళ్ళమ్మ
దేవస్థానము నందు జరుగు నిత్య అన్నదానమునకు సూళ్లూరుపేట పట్టణ వాసి మాదరపాక జయరామ్ & సన్స్ రూ.1,00,000/-లు చెక్కును శుక్రవారం ఆలయ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి చేతుల మీదుగా కార్యనిర్వాహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమములో ధర్మకర్త మండలి సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి, కర్లపూడి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.