గిరిజనులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ


అన్నదాత సుఖీభవా కార్యక్రమంలో భాగంగా ఆపద్బాంధవ సేవ ట్రస్ట్ చైర్మన్ దామా మధుసూదన రావు ఆధ్వర్యంలో మంగళవారం చొల్లంగి అమావాస్య సందర్భంగా కావలి పరిసర ప్రాంతమైన పెంకుల ఫ్యాక్టరీ సమీపంలోని గిరిజనులకు భోజనం పంపిణీ చేపట్టారు. కావలి జర్నలిస్ట్ మామిడాల సాయికుమార్, చేవూరు నివాసి నాగబాబు, కావలి నివాసి కళ్యాణ్ వర్మ సహకారంతో  ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానానికి సహకరించిన కుటుంబ సభ్యుల ఆర్థిక బాధలు తొలగి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటునాని ట్రస్ట్ చైర్మన్  దామా మధుసూదన రావు తెలిపారు. వైద్యోనారాయనో హరి కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోగులను చూసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆపద్భాంధవ సేవా ట్రస్ట్ ట్రెజరర్ దామ రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు శారద, రామచంద్ర, నూర్, తదితరులు పాల్గొన్నారు.