అరవపాలెం విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
అరవపాలెం విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ.
శ్రీసిటీ ప్రతినిధి ఉద్దూరు రాజగోపాల్ చేతుల మీదుగా పంపిణీ.
చిట్టమూరు రవి కిరణాలు న్యూస్
శ్రీసిటీ అధినేత రవి సన్నారెడ్డి సహకారంతో చిట్టమూరు మండలం అరవపాలెం శ్రీ సన్నారెడ్డి బాలకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు విద్యాసామగ్రిని పంపిణీ చేశారు.గురువారం శ్రీ సిటీ ప్రతినిధి ఉద్దూరు రాజగోపాల్ చేతుల మీదుగా ప్రతి విద్యార్థికి ఒక జామెంట్రీ బాక్స్,ఎగ్జామ్ ప్యాడ్,2పెన్నాలు,2 పెన్సిల్లు 50 మంది విద్యార్థులకు మొత్తం 10 వేల రూపాయల విలువైన విద్యా సామాగ్రిని అందజేశారు.విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు, మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలన్నారు. పేద విద్యార్థులకు అండగా ప్రోత్సాహం అందిస్తున్న శ్రీ సిటీ అధినేత రవి సన్నారెడ్డికి ఉపాధ్యాయులు,విద్యార్థులు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయురాలు ఏ ప్రభావతి,ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు.