విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ

 రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుకను సోమవారం మండలంలోని పలు పాఠశాలల చదువుతున్న విద్యార్థులకు ఈ కానుకను అందజేయడం జరిగిందని స్థానిక ఎంఈఓ మస్తానయ్య తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ విద్యార్థులకు వేసవికాలం అనంతరం పాఠశాలలను పునః ప్రారంభం జరిగినది కాబట్టి ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న జగనన్న విద్యా కానుకను ప్రభుత్వం ఆదేశాల మేరకు మొదటి రోజే విద్యార్థులకు అందించడం జరిగినది మండలంలో 66 పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించడం జరిగినది ఈ జగనన్న విద్యా కానుకలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫారం షూషూస్ మొదలగునవి అందించడం జరిగిందని ఎంఈఓ తెలియజేశారు