అరుందతివాడలో 4వరోజుకు చేరిన ధీక్ష
తమ పట్టాస్థలాలు తిరిగి ఇవ్వాల్సింది గా శాంతి యుతంగా తమ స్థలాల కోసం దీక్ష చేస్తున్న నిరాశ్రయులైన పేదలపైదుర్బాషలాడిన విఆర్‌వో పై కొడవలూరు ఎస్సై కి కంప్లైంట్ చేయటమైనది. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ శాంతి యుతంగా తమ స్థలాల కోసం దీక్ష చేస్తున్న నిరాశ్రయులైన పేదలపై విఆర్‌వో దుర్బాషలాడి పరుషంగా ప్రవర్తించడం అమానుషం, 30 సంవత్సరాల కింద కేటాయించినప్పటికీ కనీస అవసరాలు కల్పించకపోగా తుఫాను లో కొంతమంది చనిపోగా భయపడి రోడ్ మార్జిన్లు పై నివసిస్తూ మట్టి తోలిస్తే చాలు మేము గుడిసెలు వేసుకుంటాం అని అభ్యర్థించినా పట్టించుకోక,వారి స్థలాలను రద్దు పరచి కొత్త వారికి కేటాయించాలి అని చూస్తున్న వైఖరి ని నిరసిస్తున్నాం అని తెలిపారు. అర్హులైన పేదలకు కేటాయించిన తరువాతే భూ పంపకం జరగాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ తరపున కోవూరు ఇన్ఛార్జ్ శ్రీనివాసులురెడ్డి,జిల్లా యూత్ వింగ్ ఇన్ ఛార్జ్ గునుకులకిషోర్ , జిల్లా కార్యాలయ ఇన్ఛార్జ్ పసుపర్తి కిషోర్, అంకిత్, ప్రశాంత్, శశాంక్, శ్రీకాంత్, సాయి, సుచిత్,, ఆనంద్, బాలాజీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు