అభివృద్ది పనులను కౌన్సిల్లో చర్చించి ఆమోదిస్తాము : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్





తిరుపతి నగరం


తిరుపతి నగరంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులను కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో వున్న కర్నాల వీధి రైల్వే అండర్ బ్రిడ్జ్ పరిసరాలను, రైల్వేస్టేషన్ కార్నర్ నుండి కస్తూరి భాయ్ సందు, పల్లివీధి పరిసరాలను స్థానిక కార్పొరేటర్, మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నరసింహాచారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించడం సంతోషమని, అయితే కస్తూరి భాయ్ సంధు నుండి పల్లివీధికి అటు ఇటు ప్రజలు తిరిగేందుకు ఇబ్బందిగా వుందని, ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకు రావడం చేసామని, బ్రిడ్జి వద్ద నడక దారి బ్రిడ్జ్ నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగినా, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని చెప్పడంతో, అందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కస్తూరి భాయ్ సంధులో గతంలో కాలువ వుండేదని తిరిగి ప్రజల కోసం నిర్మించాలని చెప్పడంతో కమిషనర్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిశీలించి నివేదిక తయారు చేయమన్నారు. రైల్వేస్టేషన్ బయట కస్తూరి భాయ్ సంధు మొదట్లో వున్న టాయ్ లెట్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా వుంచాలని సూచించారు. పల్లివీధిలోని ప్రాధమిక పాఠశాల లోపలికి వెల్లి చేయాల్సిన పనులను తెలుసుకున్నారు. అనంతరం మంచినీళ్ళ గుంటను పరిశీలించి అందులోని నీరు పరిశుభ్రంగా వుండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తామని చెప్పడం జరిగింది. అక్కడే వున్న కర్మక్రియలు జరిపే స్థలాన్ని పరిశీలించారు, కర్మక్రియలకు కొంచెం విశాలమైన భవనం కావాలని 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి, 23వ డివిజన్ కార్పొరేటర్ ఆధిలక్ష్మి కుమారుడు మోహన్ కోరడంతో, పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిసిపి శ్రీనివాసులు రెడ్డి, డిఈలు మహేష్, తేజశ్వీ, శానిటరీ సూపర్ వైజర్ చెంచెయ్య, శానిటరి ఇన్సెపెక్టర్ గోఫి తదితరులు పాల్గొన్నారు.