అభివృద్ధి పనులు నాణ్యతా ప్రామాణాలతో జరగాలి
- రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, జనవరి 08, (రవికిరణాలు) : బుధవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్, హరనాధపురం, 2వ వీధిలో పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రామాణాలతో జరుగుతున్నాయా లేదా అని స్వయంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టేపుతో కొలవడం జరిగింది.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాలతో అభివృద్ధి పనులకుశ్రీకారం చుట్టామన్నారు. అదేవిదంగా డివిజన్ లో జరుగుతున్న రోడు పనులను డ్రైన్ల పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. ప్రతి ఒక్క డివిజన్ ఇన్ ఛార్లు అందరూ కూడా డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శానిటేషన్ పై మా సోదరులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. త్వరలోనే డివిజన్లలో ఉన్న శానిటేషన్ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ అందించాలని స్పెషల్ ఆఫీసర్ బాపిరెడ్డిని కోరామన్నారు. 18వ డివిజన్ లో ప్రారంభమైన సిమెంటు రోడ్ల పనులను 15 రోజులలో పూర్తి అయ్యే విధంగా పనిచేయాలని వెంట ఉన్న అధికారులను కోరారు. 18వ డివిజనక్కు సంబంధించి తన సోదరులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1 కోటి 45 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తికి మించి కృషి చేస్తామని అన్నారు.