సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం

అవ్వా తాతలకు ఆర్ధిక భరోసా కోసమే 3 వేలున్న పెన్షన్ మొత్తాన్ని 4 వేలకు పెంచారు. 

భావి తరాల బంగారు భవిషత్తు కోసం చంద్రబాబు కష్టపడుతున్నారు. 

అక్క చెల్లెళ్లకు మూడు సిలెండర్లు ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నాం. 

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.




  

బుచ్చిరెడ్డిపాలెం ,మేజర్ న్యూస్:

జీవిత చరమాంక దశలో అవ్వా తాతలకు ఆర్ధిక భరోసా కల్పించాలన్న సదుద్దేశంతోనే  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో 3 వేలున్న పెన్షన్ మొత్తాన్ని 4 వేలకు పెంచారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలియజేశారు. బుచ్చి మండలం విలియమ్స్ పేట గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఆమె ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందచేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు విచారించారు. వివిధ సమస్యలపై స్థానికులు యిచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించే సామర్ధ్యం ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. దివ్యాంగులు సైతం మరొకరిపై ఆధారపడకుండా       గౌరవప్రదమైన జీవితం గడిపేందుకై గతంలో ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసి 6 వేలు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఖాళీ ఖజానా అప్పగించినా సంక్షేమ పధకాల అమలులో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఐదేళ్లకు సరిపడా సంక్షేమం మరియు అభివృద్ధికి చంద్రబాబు నాయుడుపునాదులు వేస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ పల్లెలను ప్రగతి బాట పట్టిస్తుందన్నారు.సచివాలయ అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాలలో సమస్యలపై స్థానిక నాయకులు దృష్టి సారించాలని కోరారు. ఏ సమస్య వున్నా నేరుగా తనను సంప్రదించాలని నియోజకవర్గ ప్రజానీకానికి సూచించారు. విలియమ్స్ పేట సమస్యల పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందిస్తూ స్థానిక అంగన్వాడి సెంటర్ మరియు ప్రాధమిక పాఠశాలకు త్వరలో ప్రహారి గోడ నిర్మిస్తానని హామీ యిచ్చారు. పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా వుంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. విలియమ్స్ పేట సమీపంలో వున్న బుచ్చి నగర పంచాయతికి చెందిన డంపింగ్ యార్డ్ ను వేరే చోటకి తరలించాలన్న స్థానికుల ఫిర్యాదుపై ఆమె స్పందిస్తూ వీలయితే వేరే చోటకు తరలించడమా లేదంటే డంపింగ్ యార్డ్ చుట్టూ ప్రహారి గోడ నిర్మించి స్థానికులకు అసౌకర్యం లేకుండా చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, ఎంపీడీఓ శ్రీహరి, తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, టిడిపి రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షులు బత్తుల హరికృష్ణ,ఎంవి శేషయ్య, టిడిపి నాయకులు పుట్టా సుబ్రమణ్యం నాయుడు ,యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.