నెల్లూరు, పిబ్రవరి 10, (రవికిరణాలు) : సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు ఒకే ప్రాంతం అభివృద్ది చేసి ఎంతో నష్టం జరిగింది. ప్రస్తుతం అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో  ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వికేంధ్రీకరణ దిశగా పరిపాలన చేయడం హర్షించదగ్గ విషయం అని ఇలా చేసినందున ఒక్క ప్రాంతాన్ని ఒక వర్గాన్ని కాకుండా రాష్ట్రం మెుత్తం అభివృద్ది చెందుతుంది. రాయలసీమ దశాబ్ధాలుగా వెనుకబడి వుంది. ఉత్తరాంధ్ర జిల్లా పరిస్థితి అంతే. కాబట్టి పరిపాలనా వికేంధ్రీకరణను అందరూ ఆహ్వానించవలెను, ఇలా చేసినందు వలన రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే ఉద్యమం రాదు లేకుంటే మరలా రాష్ట్రం విడిపోయే ప్రమాదం వుంటుంది కనుక అన్నీ పార్టీల మేధావులు ఆలోచించి పరిపాలనా వికేంద్రాకరణకు మద్దత్తు యివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.లక్ష్మణరాజు, కె.జయరామరాజు, ఎన్‌.వి.కృష్ణయ్య, ఎస్‌.ప్రభాకర్‌రాజు, వి.శంకర్‌, పి.ప్రసన్నకుమార్‌, ఎన్‌.మోహన్‌రెడ్డి, పి.విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.