ఎన్నికలవేళ బల్కు లావాదేవీలు వివరాలు తెలియజేయాలి: తహసిల్దార్ కే శ్రీనివాస శర్మ.

మండలంలోని దుకాణదారులతో సమావేశం.

చిట్టమూరు రవి కిరణాలు న్యూస్




ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు,లావాదేవీలు నిర్వహించే వారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలని చిట్టమూరు తహసిల్దార్ కే శ్రీనివాస్ శర్మ కోరారు.సోమవారం చిట్టమూరు మండలంలోని ప్రింటింగ్ ప్రెస్,క్లాత్ షాప్స్,టెంట్ హౌస్,రెస్టారెంట్, చికెన్,గోల్డ్,కూల్ డ్రింక్స్,మినరల్ వాటర్ ప్లాంట్,కళ్యాణ మంటపం, మెస్,హోటల్,ఫర్నీచర్ షాప్,ప్రైవేటు దుకాణదారులతో సమావేశాన్ని నిర్వహించారు.గ్రామీణ ప్రాంతాల దుకాణాలను ఆసరాగా చేసుకుని నాయకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడే అవకాశం ఉన్నందున, బల్కుగా కొనుగోలు చేసే వారి వివరాలను తెలియజేసి సహకరించాలన్నారు.ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఉందన్న తహసిల్దార్ దుకాణదారులు అధికారులకు సహకరించి, అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ విజయలక్ష్మి,రీసర్వే డిప్యూటీ తహసిల్దార్ నిరంజన్,ఆర్ఐ మధులత,వీఆర్వోలు కోటయ్య, స్థానిక సిబ్బంది పలువురు పాల్గొన్నారు.