నేడు ఇందుకూరుపేటలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పర్యటన వివరాలు




ఇందుకూరుపేట, మేజర్ న్యూస్:

కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలువేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం(02/02/2025) కార్యక్రమ వివరాలను టిడిపి మండల అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి రావేళ్ల వీరేంద్ర నాయుడు తెలియజేశారు. ఉదయం 10:30 గంటలకు, ఇందుకూరుపేట మండలం లోని, గంగపట్నం పంచాయతీ నందుగల, శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఘనంగా నిర్వహించనున్న "మహా కుంభాభిషేకము, ధ్వజారోహణ" కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు.కోవూరు నియోజకవర్గం లోని తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు కూటమి కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని ఆయన పిలుపునిచ్చారు.