చెంగాళ్లమ్మ తల్లిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫిబ్రవరి 24 (రవి కిరణాలు):-

కాళ్ళంగి నది ఒడ్డున వెలసి అన్న భక్తుల కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణం ఖాళీ శ్రీ చెంగాలమ్మ తల్లిని శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు వీరికి ఎమ్మెల్యే కి సంజీవయ్య, ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆలయ ఈవో ఆళ్ళ శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.