దంత సంరక్షణపై అవగాహన సదస్సు
దంత సంరక్షణపై అవగాహన సదస్సు
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 09
కోవూరు కమ్యునిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. వెంకటచలపతి, వైద్యాధికారుల అధ్వర్యంలో ప్రపంచ ఓరల్ హెల్త్ (మార్చి20 - ఏప్రిల్ 20) మాసోత్సవాల సందర్భంగా బుధవారం కోవూరు దంత వైద్య నిపుణురాలు డాక్టర్ వి.జ్యోతి ప్రభ దంత సంరక్షణపై పలు సూచనలు, సలహాలు చేస్తూ - అవగాహన సదస్సును నిర్వహించారు. నోటి ఆరోగ్యమే దేహ ఆరోగ్యమని, నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పొగాకు, పాన్, జర్దా, కైని లాంటి వాటి జోలి కి పోకుండా ఉండాలని, వాటివల్ల వివిద రకాల నోటి క్యాన్సర్లు వస్తున్నాయి. అని, ప్రతిఒక్కరు దంతవ్యాదుల విషయంలో అప్రమతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంతో సిహెచ్ సి వైద్యాదికారులు, సిబ్బంది పాల్లాన్నారు.