గతంలో చెప్పిన విధంగా ఎస్సి, ఎస్టి, బిసి,మైనారిటీలకు 45 సంవత్సరాలకే పింఛన్లు ఇవ్వాలి - చేజర్ల 

తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంటిలో అవ్వ,తాతల లో ఒక్కరికే ఫించన్ ఇస్తున్నారని,నేను అధికారంలోకి వస్తే ఒకే ఇంటిలో అవ్వ,తాత ఇద్దరికి పింఛన్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పెన్షన్లు కూడా తీసివేసి అవ్వా, తాతలను రోడ్డు మీద పడవేసారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి  చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని,గతములో ముఖ్యమంత్రి చెప్పిన మాటకు కట్టుబడి రాష్ట్రములోని యెస్ సి,యెస్ టి,బి సి,మైనారిటీలకు 45 సంవత్సరాలకే పింఛన్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోవూరు మండల పరిషత్తు ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడము జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే కుటంభములో ఎంతమంది అర్హులు ఉంటే అందరికి పింఛన్లు ఇస్తామని,45 సంవత్సరాలు పూర్తి అయిన యెస్ సి,యెస్ టి,బి సి మైనారిటీ లందరికి పింఛన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చి కుటుంభములోఎంత మంది అర్హులు ఉన్న ఒక్కరికి మాత్రమే  పింఛను  ఇస్తున్నారని,అసలకు నేను ఎప్పుడు 45 సంవత్సరాలకే ఫించన్ ఇస్తానని  చెప్పలేదని అంటున్నారని మాట్లాడితే మాట తప్పం,మడమ తిప్పము అనే జగన్మోహన్ రెడ్డి ఇది మాట తప్పడం కదా అని,వృధ్యాప పింఛను అర్హత వయస్సు 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించిన తరువాత పెరగ వలసిన పింఛన్లు తగ్గాయని,2019 వ సంవత్సరం మే నెలలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 24,03,077 వృధ్యాప పింఛన్లు ఉంటే,2020 ఫిబ్రవరి నెలకు 23,89,580 కి తగ్గాయని,దరఖాస్తు చేసుకున్న 72 గంటలలోని కొత్త పింఛన్లు ఇస్తానని చెప్పి గత 8 నెలలుగా ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వకుండా ఈ నెలలో మాత్రం కొత్తగా 6లక్షల పింఛన్లు మంజూరు చేసామని చెప్పి,7 లక్షలు తొలగించారని,గతములో తెలుగుదేశం ప్రభుత్వం రూ 200 ఉన్న పింఛన్ ను రూ 2వేలకు పెంచగా,వైస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి ఉన్న పింఛన్లు తొలగిస్తున్నారని, భర్త చనిపోయిన వారికి ఇచ్చే వితంతువు పింఛన్లు వయస్సు లేదని తొలగించారని దీనిని బట్టి ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందొ అర్ధమవుతుందని,ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తొలగించిన పింఛన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ధర్నా అనంతరం ఈ ఓ పి ఆర్ డి కి వినతిపత్రం ఇవ్వడము జరిగినది.ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, తొలగించబడిన పెన్షన్ దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, పెనుమల్లి శ్రీహరిరెడ్డి, గునుపాటు రవీంద్రరెడ్డి, జొన్నదుల రవికుమార్,ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి,గిద్దలూరు వెంకటేశ్వర్లు,ఒబ్బారెడ్డి మల్లికార్జున రెడ్డి,బాల రవి, యద్దలపూడి నాగరాజు,మామిడి మురళి,చామంతిపురం గౌతమ్   కలికి సత్యనారాయణ రెడ్డి,సాయి రోశయ్య,ఇంటూరు విజయ్,శివుని రమణా రెడ్డి,బుధవరపు శివకుమార్,ఆజిగంటి రమణయ్య,గుంజి పద్మనాభం,బత్తల రమేష్ తదితరులు పాల్గొన్నారు