శ్రీహరికోట లో అప్పులు తీర్చలేక వ్యక్తి బలవన్మరణం.

తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట:-

 అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీహరికోట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు కిపాకం లేబర్ కాలనీకి చెందిన ఇత్తి రెడ్డి రవీంద్రరెడ్డి (48) ఆయన భార్య షార్ లో పొరుగు సేవల కింద విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఇరువురికీ పెళ్లి చేశారు. దీంతో వారికి అప్పులు అయ్యాయి. వాటిని తీర్చలేక ఉరి వేసుకొని రవీంద్ర రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.