నెల్లూరు జిల్లా....
సర్వే పల్లి కాలువలో మృతదేహం..అనావలు తెలిసిన వారు నెల్లూరు బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ లో సంప్రదించగలరు

 నెల్లూరు 6వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని సర్వేపల్లి కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం....

  ఈ రోజు సాయంత్రం  సర్వేపల్లి కాలువలో బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో  గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం కొట్టుకు వచ్చింది...   మృతుని వయసు సుమారు 40-45 సంవత్సరాలు ఉండవచ్చని,మృతుడి తల మీద జ్యోతి అని పచ్చ బొట్టు వుందని,ఇతను క్రీమ్ కలర్ షర్ట్ నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని ఈ ఆనవాలు తెలిసిన వ్యక్తులు ఎవరైనా 6వ నగర పోలీసులకు సమాచారం ఇవ్వాలని బాలాజీ నగర్  ఎస్సై సుమన్ తెలియచేశారు....

 ఈ గుర్తు తెలియని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు...చనిపోయిన  వ్యక్తి హత్యా లేక ఆత్మ హత్యా ఘటన ఎలా జరిగివుండొచ్చు అనే విషయాలు పై దరాప్తు చేపట్టినట్టు ఎస్సై సుమన్ తెలియ చేసారు....