దళిత ద్రోహి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి:- మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ విమర్శజగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కుష్టి రోగి లాగా తయారైంది.
దళిత ద్రోహి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి:- మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ విమర్శజగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కుష్టి రోగి లాగా తయారైంది.
చంద్రబాబు నాయుడు కి
ఏ అంటే అమరావతి
పి అంటే పోలవరం అని ఏపీకి అర్థం .
బిజెపి ప్రభుత్వంలో ప్రజలు అప్పుల కొరకు ఢిల్లీ బజారులో అడుక్కుంటున్నారు.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని ఎస్సీ కార్పొరేషన్ను పూర్తిగా మూసేసి దళిత వ్యతిరేకంగా మారిపోయాడని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ మంగళవారం సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ధర్నా చేశారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించాలని నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు ఆంధ్రుల ఆత్మగౌరవం అధోగతిగా మారిందని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కుష్టి రోగిలాగా తయారు చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని రాష్ట్రంని అప్పులు పాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దక్కుతుందని రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీల ఓట్లు వల్ల గెలిచిన మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే ఎస్సీ ఎస్టీలను నిర్వీర్యం చేశారని అందువలన మరల రెండోసారి ఘోర పరాజయం అయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లే ఉన్నాయని ఏ ముఖ్యమంత్రి అయిన గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచూ అంటున్న ఏపీ కి అర్థం మారిందని ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటూ జపిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ దేశ ప్రజల పట్ల చులకనగా వ్యవహరిస్తున్నారని దేశంలో ఆంధ్రుల ఆత్మగౌరవం అధోగతిగా మారిందని అప్పుల కొరకు ఢిల్లీ బజార్లో అడుక్కుంటున్నారని అన్నారు. ప్రధానమంత్రి కి పోలవరం తప్ప దుగరాజుపట్నం పోర్టు గుర్తుకు రావడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో దుగరాజపట్నం పోర్టు వల్ల వేల మంది నిరుద్యోగులు కు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకు ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకువచ్చి దుగరాజపట్నం పోర్టుని తరలిపోకుండా కొనసాగించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చందనమూడి శివ , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.