పోలీస్ గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వెల్లువ అర్జీలు స్వీకరించిన డిటిసి డిఎస్పి
పోలీస్ గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వెల్లువ అర్జీలు స్వీకరించిన డిటిసి డిఎస్పి
నెల్లూరు క్రైం మేజర్ న్యూస్:
ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంకు అర్జీదారులు క్యూ కట్టారు.
జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు డిటిసి డిఎస్పి గిరిధర్ రావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో :
బాలాజీ నగర్ పరిధికి చెందిన వ్యక్తి యొక్క ఇన్స్టాగ్రాం కు అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతూ అనామకులు బెదిరిస్తున్నారని, తద్వారా బార్యాభర్తలకు మనస్పర్ధలు వచ్చి విడిపోయామని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
2. నెల్లూరు రూరల్ పరిధికి చెందిన మహిళ, తన భర్త కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు, తన పక్కింటి వారు అయిన నరసయ్య, దేవేంద్ర, దేవసేనలు తన పట్ల కుల వివక్ష చూపుతున్నారని, నరసయ్య అనే వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని, వారి నుండి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.నెల్లూరు రూరల్ పరిధికి చెందిన మహిళ తన కుమార్తె అనుమానాస్పదంగా మరణించినట్లు, అత్తమామలు వేధింపులతో చనిపోయారని, పూర్తిగా విచారించి, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
వేదాయపాలెం పరిధికి చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి సైనిక కుటుంబాలకు చెందిన భూములను రెవిన్యూ రికార్డులలో నమోదు చేయిస్తానని నమ్మించి, డబ్బులకు తీసుకొని మోసం చేసాడని న్యాయం చేయాలని కోరారు.నెల్లూరు రూరల్ పరిధికి చెందిన మహిళను భర్త, అత్తమామలు పిల్లల గురించి పట్టించుకోకుండా వేధిస్తున్నారని, కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని విన్నవించారు.
బాలాజీ నగర్ పరిధికి చెందిన మహిళ ప్రేమ వివాహం చేసుకున్నట్లు, చెడు వ్యసనాలకు బానిసై వేదిస్తూ, పిల్లలను, నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.