కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలిపి డి ఎస్ యు

ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన విద్యాసంస్థలపై గుర్తింపు రద్దు చేయాలి   

తిరుపతి డి ఇ ఒ శేఖర్  కి వినతిపత్రం అందజేసిన పి డి ఎస్ యు నాయకులు.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

       తిరుపతి జిల్లాలో గుర్తింపు లేకుండా నడుస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు ఆధ్వర్యంలో మంగళవారంనాడు జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ శేఖర్ కి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి ఎస్.జాకీర్ మాట్లాడుతూ తిరుపతి  జిల్లాలోని 

కార్పొరేట్ మరియు  ప్రైవేట్ విద్యాసంస్థల్లో వివిధ రకాల పేర్లతో జరుగుతున్న ఫీజుల దోపిడీ అరికట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యు) డిమాండ్ చేశారు.

కార్పొరేటు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం ఫీజుల దోపిడీని అరికట్టాలని జీవో నెంబర్ 1,42 లను అమలు చేయని పాఠశాలలను సీజ్ చేయాలని  పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి ఎస్. జాకీర్ డిమాండ్ చేశారు

జిల్లాలోని కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల వారు  విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అనేక రకాల పేర్లతో విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాసంవత్సరం ప్రారంభించడానికి ముందే విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పుస్తకాలు, యూనిఫారం,స్పెషల్ ఫీజు పేర్లతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న

ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో మౌళిక సదుపాయలు మెరుగుపరచాలి.నాడు-నేడు పేరుతోపాఠశాలల్లో జరగుతున్న పనులలో అవినీతి, అక్రమాలను అరికట్టాలి.కె.జి. టు పి.జి. ఉచిత విద్యను ప్రభత్వం అందించాలి.

 విద్యా కానుక కిట్లు (పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, షూస్, బ్యాగ్, సాక్సులు, యూనిఫారం) విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో అందించాలి 

అమ్మఒడి పేరుతో ఇస్తున్న 15 వేల రూపాయలను ఎటువంటి కోతలు లేకుండా విద్యార్థులందరికీ ఇవ్వాలి. 6. పాఠశాలలను, టీచర్ పోస్టులను కుదించే 84,85,117 జీ.వో. లను రద్దు చేయాలి. 3,4,5 తరగతుల విలీనం నిలిపి వేయాలి ఆయన తెలియజేశారు లేనిపక్షంలో పిడిఎస్యు ఆధ్వర్యంలో అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న విద్యా వ్యవస్థలపై ఆందోళన లు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడీ ఎస్ యూ తిరుపతి సిటీ నాయకులు లోకేష్...  , శ్రీకాళహస్తి డివిజన్ నాయకులు ముబాషీర్ . పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సునీల్ తదితర నాయకులు పాల్గొన్నారు