తిరుపతి జిల్లా, వాకాడు మండలంలోని దుగరాజ పట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ ను గురువారం వైజాగ్ సౌత్ డీఎస్పీ ఎం శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. తీర ప్రాంత ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తే, వారి ద్వారా అనుమానితుల సమాచారం తెలుస్తుందని సిబ్బందికి సూచించారు.
 కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, సముద్ర తీరం వెంబడి కొద్దిసేపు నడిచి, అక్కడి పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. గతంలో జరిగిన వివాదాల గురించి ఆరా తీశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. సముద్ర తీర ప్రాంతంలో ఎవరైనా అక్రమ వ్యాపారాలు చేసినా, అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు, మద్యం సేవించిన వారు, సంచరించినా జంటలు కనపడితే, 1093 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు మీడియా ముఖంగా తెలిపారు. ఆయన వెంట మెరైన్ సీఐ, ఎస్సై, సిబ్బంది తదితరులు ఉన్నారు..