మర్రిపాడు, జనవరి09, (రవికిరణాలు) : దేశం నలుమూలల నుండి రాజకీయ నాయకులు విద్యావంతులు ప్రముఖులు శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ప్రముఖ శాస్త్రవేత్త గుండ్ర సతీష్ రెడ్డి మాతృమూర్తి సంతాప సభలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు సతీష్ రెడ్డి మాతృమూర్తికి సంతాపం తెలియజేశారు. దేశ నలుమూలల నుంచి ప్రముఖులు తరలి రావడంతో పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ, సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.