కావలి ఏరియా హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డి.సి.హెచ్.యస్
November 13, 2020
DCHS Dr Prabhavati expressed satisfaction over the services provided by the doctors at Kavali Area Hospital. gave various instructions to the disabled.
కావలి ఏరియా ఆసుపత్రి లో వైద్యులు అందిస్తున్న సేవల పట్ల డి.సి.హెచ్.యస్ డాక్టర్ ప్రభావతి సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆసుపత్రి లో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపును పరిశీలించి వికలాంగుల కు పలు సూచనలు అందించారు. అనంతరం ఆసుపత్రి లో వైధ్యులు అందిస్తున్న సేవల పై సూపరింటెండెంట్ డాక్టర్ మండవ వెంకటేశ్వర్లు, ఆర్.యమ్ డాక్టర్ ప్రసూన లతో కలిసి సమీక్షించారు. వార్డులలో రోగుల పట్ల తీసుకొంటున్న చర్యల పై అప్రమత్తంగా ఉండాలని, వారిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రి కి సంబంధించి సూపరింటెండెంట్, ఆర్ యమ్ ఒ లు అభివృద్ధికి సంబంధించి చేసిన సూచనల పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని డాక్టర్ ప్రభావతి తెలిపారు.