నవధాన్యాల సాగు చేయండి, నేల తల్లిని కాపాడండి.


సూళ్లూరుపేట మార్చి 10(రవి కిరణాలు):-

 సూళ్లూరుపేట .నాయుడుపేట డివిజన్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి తిరుపతి  జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ మునిరత్నం మీటింగ్ నిర్వహించారు.  నవధాన్యాలు సాగు చేయడం వల్ల భూమికి వచ్చే ఉపయోగా వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రకృతి వ్యవసాయం వల్ల ఉపయోగాలు రైతులకు వివరించాలని అధికంగా రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన పంటను ఆహారంగా తీసుకోవడం వల్ల వచ్చే అనర్ధాలను రైతులకు వివరించాలని, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు తెలియజేయాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఆయన తెలిపారు. అనంతరం  ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఐ సి ఆర్ పి, ఐబీ  ఐ సి ఆర్ పి, అందరూ కలసి నవధాన్యాల సాగు నేల తల్లికి బాగు, నవధాన్యాలు చల్లండి భూసారాన్ని పెంచండి. ప్రకృతి వ్యవసాయం ముద్దు, రసాయన వ్యవసాయం వద్దు, అంటూ నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ  ప్రాజెక్జు మేనేజర్ మునిరత్నం  మాట్లాడుతూ  పొలాల్లో పచ్చ రొట్టె ఎరువులు చల్లేటప్పుడు  నవధాన్యాలు చల్లి పచ్చ రొట్టి ఎరువుగా కలియ దున్నడం వల్ల భూమిలో  అధిక సంఖ్యలో సూక్ష్మజీవులు, సూక్ష్మ పోషకాలు పెంపొంది.  భూమిలో జీవన వైవిధ్యం ఏర్పడి ప్రధాన పంటకి కావాల్సిన పంటకి కావలసిన పోషకాలు అందుతాయని భూమిలో తేమశాతం పెంచడమే కాకుండా ప్రధాన పంటలో అధిక దిగుబడులను పొందేందుకు నవధాన్యాల సాగు ఉపయోగపడుతుందని తెలియజేశారు. పచ్చ రొట్టె ఎరువులు చల్లేటప్పుడు ఒకే రకం విత్తనాలు చల్లకుండా పలు రకాల నవధాన్యాలు చల్లడం వల్ల ఒక్కో మొక్కకు ఒక్కో విధమైన పోషక విలువలు కలిగి ఉంటాయని, భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలో సారం పెరిగి రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతిలో దొరికే ఆకుల ద్వారా కషాయాన్ని తయారు చేసుకుని పిచికారి చేయడం వల్ల ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంట సాగు చేయవచ్చునని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో దొరవారిసత్రం మండలం ప్రకృతి వ్యవసాయం ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, నాయుడుపేట మండలం ప్రకృతి వ్యవసాయ ఇంచార్జ్ అనంతరావు,  ప్రకృతి వ్యవసాయ. ఎం సీ ఏ కల్పన, షబీనా, సంజీవరావు. మారయ్య.శ్రీనివాసులు .ప్రకృతి వ్యవసాయ సిబ్బంది  పాల్గొన్నారు.