నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడితో మర్యాదపూర్వక భేటీ...
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడితో మర్యాదపూర్వక భేటీ...
రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వహక కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా సయ్యద్ సాజీత్ బాషా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జీ అబ్దుల్ అజీజ్ గారిని, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ధన్యవాదములు తెలియచేశారు...
ఈ సందర్భంగా సయ్యద్ సాజీత్ బాషా మాట్లాడుతూ...
తన పై నమ్మకం ఉంచి, పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, జిల్లా నాయకులకు ధన్యవాదములు తెలియచేశారు....
వైసీపీ చేస్తున్న అరాచకాలను, అన్యాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు...
సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ, రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు...