కార్పొరేటర్లు ప్రజల దృష్టిలో ద్రోహులే
కార్పొరేటర్లు ప్రజల దృష్టిలో ద్రోహులే
వైసీపీ విధానం నచ్చలేదని చెప్పే కార్పొరేట్లు రాజీనామా చేయాలి
మాజీ మంత్రి కాకాణి వెల్లడి
నెల్లూరు,మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ ను ఉల్లంఘించి తెలుగుదేశం పార్టీకి మద్దతు మద్దతు పలికిన కార్పొరేటర్లు ప్రజల దృష్టిలో ద్రోహులే ని ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీ ఫారంపై పోటీ చేసే సాహసం కూడా చెయ్యలేదని వైసీపీ నుంచి వెళ్లిన వారికే డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చారని పేర్కొన్నారు.
వైసీపీ విధానాలు నచ్చలేదని చెప్పే కార్పొరేటర్స్ పదవులకు కూడా రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
టీడీపీ బీఫారం ఇవ్వలేదని చెప్పడానికి ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న జేసీ కూడా భయపడ్డాడని వివరించారు. విప్ గురించి కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు టీడీపీలో ఉన్నారని పేర్కొన్నారు.జూదంలో ఓడిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచారని గెలుపు ఓటములు శాశ్వతం కాదన్నారు.
వైసీపీ జారీ చేసిన విప్ దెబ్బకు టీడీపీ భయపడిందన్నారు. పార్టీ కోసం నిలబడిన కార్పొరేటర్స్ కి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోలీసులు చేతులెత్తెశారని . టీడీపీ, జనసేన అరాచకాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్నారు.
నెల్లూరు కార్పొరేషన్, బుచ్చి నగరపాలక పంచాయతీలలో విప్ ధిక్కరించిన వారిపై వేటు వెయ్యాలని ఎన్నికల అధికారులను కలుస్తున్నామన్నారు.
కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పదవిలో ఉన్నప్పుడే అనర్హత వేటు వేసేలా న్యాయస్థానాన్ని కోరుతామన్నారు. ఈ సమావేశంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.