బీఫ్ మాంసం కంటైనర్ ను పట్టుకున్న కార్పొరేషన్ అధికారులు
బీఫ్ మాంసం కంటైనర్ ను పట్టుకున్న కార్పొరేషన్ అధికారులు
నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య , వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ స్థానిక 12 వ డివిజన్ చింతారెడ్డి పాలెం రాజుపాలెం దగ్గర శనివారం
బీఫ్ మాంసం ఎటువంటి అనుమతులు లేకుండా షుమారు 3 నుంచి 4 టన్నుల 5 లక్షల రూపాయల విలువైన బీఫ్ మాంసం తరలించేందుకు సిద్ధంగా వున్న కంటైనర్ను పోలీసు వారి సహకారముతో సీజ్ చేశారు.
అనంతరం డాక్టర్ చైతన్య ,డాక్టర్ మదన్మోహన్ మాట్లాడుతూ పట్టుకున్న మాంసంకు సంబంధించిన యజమానిని విచారించగా ఎటువంటి అనుమతులు లేవని సంబంధిత ఓనర్ తెలియజేశారని కావున సీజ్ చేసిన మాంసమును దొంతాలి కంపోస్ట్ యార్డు కు తరలించి నిర్వీర్యం చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ సానిటరీ సూపర్వైజర్ నరసింహారావు పోలీస్ వారు సిబ్బంది పాల్గొన్నారు