కార్పొరేషన్ స్థలమని ధృవీకరించారు

విజ్ఞానం, ఆహ్లాదం కలబోతే సైన్స్ పార్క్



కమిషనర్ దినేష్ కుమార్  నెల్లూరు నగర ప్రతిష్టను పెంపొందించేలా నిర్మాణం చేస్తున్న సైన్స్ పార్క్ స్థలం వక్ఫ్ బోర్డు స్థలంగా ఆ స్థలాన్ని భావించి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసారని, అయితే వక్ఫ్ బోర్డు కమిషనర్ విచారణ జరిపి, ఆ స్థలం నెల్లూరు నగర పాలక సంస్థకు చెందినదిగా ధృవీకరించారని కమిషనర్ వెల్లడించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. విజ్ఞానం, ఆహ్లాదం కలబోతే సైన్స్ పార్కు నిర్మాణమని వివరించారు

విద్యార్థి దశనుంచి చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా నగరంలో సైన్సు పార్కు నిర్మాణం చేపట్టామని, దేశంలోనే మూడవ నిర్మాణంగా పార్కులో వెలుగుల విభాగాన్ని అధ్బుతమైన ప్రణాళికతో రూపొందించనున్నామన్నారు