టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్
టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్
కరోనా మహామ్మారి ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సినిమా తారల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్, వడివేలు ఇలా ఈ మధ్య వరుసగా సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్ భయపెడుతున్న ఈ నేపథ్యంలో కరోనా కూడా విజ్రంభించడం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఓమైక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో సెలబ్రెటీలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా యంగ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం రోజులుగా కలిసిన వారందరూ.. దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు.. నేను క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి. నాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్స్ లకు ధన్యవాదాలు”.. అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు మనోజ్. ఇక కరోనా వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.