చంద్రబాబుకు కరోనా పాజిటివ్


తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిందంటూ తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు పాజటివ్ రావడంతో వైద్యులను సంప్రదించినట్లు తెలిపారు.

గత మూడు రోజులుగా తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపిన చంద్రబాబు ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నానని వివరించారు. త్వరలోనే ఆరోగ్యం బాగు చేసుకొని మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

తమ అభిమాన నేత కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. కాగా ఆయన కుమారుడు లోకేష్ బాబుకు కూడా నిన్ననే కరోనా వ్యాధి నిర్ధారణ కావడం గమనార్హం.