గుర్తు తెలియని దొంగలు నాయుడుపేట మండలం మేనకూరులోని బ్రేక్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రై.లిమిటెడ్ లోనికి ప్రవేశించి మెల్టింగ్ ఆఫీసు అదాలు పగులగొట్టి లోపలి కి వెళ్ళి రూ.1,00,000 విలువ కలిగిన సుమారు 125 కేజీల కాపర్ ను దొంగిలించుకు పోయినట్లుగా ఏర్యాది దారుడు అయిన బ్రేక్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రై.లిమిటెడ్ హెచ్‌ఆర్‌ అయిన మల్లాం హరి కిరణ్ రిపోర్ట్ మేరకు నాయుడుపేట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయడమైనది. పై కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు నాయుడుపేట పోలీసు స్టేషన్ ఎస్సై డి.వెంకటేశ్వర రావు వారి సిబ్బంది సహాయంతో ముద్దాయులను నాయుడుపేట మండలంలోని కోనేటి రాజుపాలెం వద్ద అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 125 కిటల కాపర్ స్కాప్ అచ్చులు మరియు బాజా డిస్కవర్ కంపెనీ కి చెందిన ఏపి 26 ఏఈ 5755 తదుపరి దర్యాప్తు
నిమిత్తం స్వాధీనం చేసుకోవడమైనది. సదరు విషయంను నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వేణు గోపాల్ రెడ్డి ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.