కంటైనర్‌ లారీ ఆటో ఢీ








 నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి కాజ్‌వేపై ముందు వెళుతున్న కంటైనర్‌ లారీ ఒక్కసారిగా నిలిపి వేయడంతో వెనకనే వస్తున్న ఆటో ఢీకొనింది. సంఘవరం నుంచి నాయుడుపేట వైపు వస్తున్న ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ శీనుతో పాటు మరో నలుగురు మహిళా ప్రయాణికులకు స్వల్పగాయాలైయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే స్వర్ణముఖి కాజ్‌వేపై ప్రమాదానికి గురైన వాహనాలు నిలిపి వేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.