అక్రమ మసీదు కట్టడాన్ని వెంటనే నిలిపివేయాలి : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి
అక్రమ మసీదు కట్టడాన్ని వెంటనే నిలిపివేయాలి : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి
నెల్లూరు నగరంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో శనివారము ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ కొత్తూరు, 31వ డివిజన్, రామకోటయ్య నగర్ ,సుజాతమ్మ పౌల్ట్రీ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్న అక్రమ మసీదు కట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల కోసం కేటాయించిన సుమారు 120 అంకణాల 10 కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించి కట్టడం ఎంతవరకు సమంజసము అని ఆయన ప్రశ్నించారు. సొంత భూమి లేదా ఎవరైనా భూమిని దానం చేస్తే మసీదు కట్టుకోవచ్చని మసీదు కట్టడానికి మేము వ్యతిరేకం కాదన్నారు. దీని గురించి కలెక్టర్ గారి కి కూడా ఫిర్యాదు చేశామని కలెక్టర్ కూడా అక్రమ మసీదు కట్టడానికి వీలు లేదని చెప్పారన్నారు. అనంతరం వైసిపి పార్టీ రోజురోజుకీ బురదలో కురుకు పోతుందని, ఇక భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడ సాగించచలేదని, మాజీమంత్రి రోజా కూడా త్వరలో పార్టీ మారబోతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తూ జన్మభూమి కమిటీల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయవద్దని విన్నవించారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన చాల విజయవంతంగా జరిగిందని, ప్రజలనుంచి, పార్టీల నుంచి వచ్చిన అర్జీలను తీసుకొని త్వరిత గతిన పరిష్కరిస్తానని ,ఆయన హామీ ఇవ్వడం జరిగిందన్నారు అలాగనే నెల్లూరులో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యరబోలు రాజేష్, జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్, ఓబీసీ మొర్చ జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గిరి కుమార్ గౌడ్, బీజేవైఎం తిరుపతి జిల్లా ఇన్చార్జ్ లెక్కల రాజశేఖర్ రెడ్డి, స్టేట్ లీగల్ సెల్ మెంబర్ దాసరి రాజేంద్రప్రసాద్, హజరత్, తదితరులు పాల్గొన్నారు.