ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సహకారంతో పడుగుపాడులో సిసి రోడ్ నిర్మాణం.





కోవూరు. మేజర్ న్యూస్ 

 కోవూరు మండలం పడుగుపాడు గ్రామపంచాయతీ విన్నకోట వారి వీధి నందు మండల ప్రజా పరిషత్ నిధుల నుండి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సహకారంతో పడుగుపాడు టిడిపి నాయకులు విన్నకోట రాఖీ సీసీ రోడ్ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెట్టి మదన్ రెడ్డి, దారపనేని శ్రీనివాసులు నాయుడు  విచ్చేసి సిమెంట్ రోడ్డుకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి  సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సహకారంతో పడుగుపాడువిన్నకోట వారి వీధి నందు సిసి రోడ్ నిర్మించుకోవడం జరిగిందని, అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి ధ్యేయంగా  ముందుకెళుతున్నటువంటి మన ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, రాబోవు రోజుల్లో  రాష్ట్రంలో కోవూరు నియోజకవర్గాన్ని  అభివృద్ధి దిశగా మొదటి స్థానంలో నిలబెడతారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు విన్నకోట రాఖీ, షేక్ ఫిరోజ్, సాయి, మాజీ ఎంపిటిసి గోడ సమాధానం, తదితర నాయకులు పాల్గొన్నారు