అనూష మృతిపై ఉధృతమవుతున్న ఆందోళనలు
ఉదయగిరి, డిసెంబర్ 26, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీలోని వెంకట్రావుపల్లె గ్రామంలో తోకల అనూష అనుమాన స్పద మృతికి కారణమైన వెంకట(రెడ్డి)ని ఏడు రోజులు గడుస్తున్నా నిందితుడిని ఎందుకు అదుపులోకి తీసుకుని విచారించలేదని గురువారం యం ఆర్ పి యస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కలసి స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు.ఉదయగిరికి ఆయా సహాఖల మంత్రుల రాకతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టు దట్టమైన బందోబస్తీ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ అక్కడికి చెరుకోగా ఆయన కారుకు అడ్డంగా నిలబడి మృతురాలు అనూష కి న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని నినాదాలతో డిమాండ్ చేశారు.దీంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మీ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చిందని,కలెక్టర్ తో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో విషయం సద్దుమణిగింది.అదే రీతిలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన యం ఆర్ పి యస్,ప్రజా సంఘాల నాయకులతో కావలి డి యస్ పి ప్రసాద్ మాట్లాడి నిందితుడి పై కేసు నమోదు చేసి అనూష కేసు లో నిజా నిజాలు నిగ్గు తేల్చి నిందితుడికి కఠినమైన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు.దీంతో యం ఆర్ పి యస్ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఆందోళనను విరమించుకున్నారు.ఐతే సబ్ కలెక్టర్,డి యస్ పి భాదితులకు చెప్పిన మాట ప్రకారం న్యాయం చేస్తారా? వేచి చూడాల్సిందే