కోనసీమ జిల్లా ప్రప్రథమ కలెక్టర్ హిమాన్ష్ శుక్ల బదిలీ పై కోనసీమ వాసుల ఆవేదన
July 05, 2024
Concern of Konaseema residents over the transfer of Konaseema District First Collector Himansh Shukla
కోనసీమ జిల్లా ప్రప్రథమ కలెక్టర్ హిమాన్ష్ శుక్ల బదిలీ పై కోనసీమ వాసుల ఆవేదన
అనగనగా ఒక చిరు నవ్వుల రారాజు కరెక్ట్ గా రెండు ఏళ్ల 3 నెలలు క్రితం మా జిల్లాకి వచ్చారు జిల్లాలు విడిపోవడం ఆ రారాజు రావడం ఎక్కడ ఏమి ఉందో కుడా తెలియని గందర గోళం గజి బిజిగా ఉన్న సమయం ఆయన ఉండాడానికి కుడా ఆఫీసు కుడా లేని జిల్లా హెడ్ క్వార్టర్స్ అయోమయం అసలే చీకటి గాఢ అంధకారం అన్న చందన ఉంది కొత్త జిల్లా ఆతరువాత వెంటనే వరదలు మా కోనసీమ ను ముంచెత్తిన పరిస్థితులు ఐన రారాజు అధైర్య పడలేదు మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడిక్కడ వరద ఉధృతి నీ పరిశీలిస్తూ ప్రజా అవసరాలకు అనుగుణంగా వారికి ఏమి కావాలో చూసే ఏర్పాట్లు చేసి అందరి మన్నలను పొందిన ఆ రారాజు వరదలు ఐపోయి వర్షాలు కురిసి రైతులు పంట నష్టాలు నీ దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు రచించి రైతులు పంట లు బాగా పండాలి అంటే దిగువాలి వ్యవస్థ మెరుగు పరచడానికి సియస్అర్ నిధులు కేటాయించి డ్రెయిన్లు ఆధునీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఆయన రెండు కాజ్ వేలు కట్టిస్తే అతని పేరు పెడుతుంటే నా పేరు వద్దు రామసేతు లు గా నామకరణం చేయండి అని అభివర్ణించిన దీరో ధాతుడు శ్రీరామ చంద్రుడు మా రాజు రారాజు అతనే కోనసీమ జిల్లా ప్రప్రథమ కలెక్టర్ హిమాన్ష్ శుక్ల బదిలీ తీరని బాధను కలిగించిన కానీ ఉద్యోగ దర్మం నిర్వర్తించాలి మరి మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే మా జిల్లా అభివృద్ధికి తొడపాలి అని కోరుకుంటూ కోనసీమ జిల్లా ప్రజలు