వృద్దుల రక్షణ, మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాలను అరికట్టే దిశలో చర్యలు- జిల్లా యస్.పి. 
రౌడీ షీటర్ లు ఎటువంటి నేరానికైనా పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం 
జిల్లా వ్యాప్తంగా స్పందన కు ఈ రోజు మొత్తం "153" పిర్యాదులు
నెల్లూరు, జనవరి 27, (రవికిరణాలు) : "స్పందన" కార్యక్రమంనకు అందిన పిర్యాదులను నిర్దేశించిన గడువు లోగా పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న "స్పందనను" వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ లైవ్ లో పర్యవేక్షిస్తూ సంబందిత పోలీసు అధికారులకు తగు ఆదేశాలు జారీచేశారు. సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా పోలీసు కార్యలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు జిల్లా యస్పి నిర్వహించారు. అన్నీ పోలీసు స్టేషన్ లు, సర్కిల్ మరియు యస్.డి.పి.ఐ. ఆఫీసు లలో జరుగుతున్న స్పందన కార్యక్రమం కూడా జిల్లా యస్పి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ, వెంటనే వారి సమస్యల పై అక్కడి అధికారులతో లైవ్ లో మాట్లాడుతూ తగిన ఆదేశాలు జారీ చేసినారు.స్పందనకు జిల్లా నలుమూలల నుండి యస్పి స్పందన కార్యక్రమానికి మొత్తం 140 మంది ఫిర్యాదుదారులు హాజరుకాగా, అన్నీ సబ్ డివిజన్ స్థాయిలో మరో 13 ఫిర్యాదులు అందినవి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో వరకట్నం వేధింపులు, భార్యా భర్తల గొడవలు, అప్పులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించని కేసులు, వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న సంతానం, మిస్సింగ్ కేసుల అర్జీలు ఎక్కవగా ఉన్నవి. అన్నింటినీ కుణ్ణంగా పరిశీలించిన యస్పి వాటిని సంబంధిత అధికారులకు ఎన్టార్స్ చేయుచూ, గ్రేవ్ కేసులను మరియు హర్ట్ కేసులను ఒక గంటలోపే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మిస్సింగ్ కేసులను అలసత్వం లేకుండా నిర్దేశించిన గడువు లోగా త్వరితగతిన పరిష్కరించాలని, అంతేకాకుండా రౌడీ షీటర్స్ ఎక్కడైనా దాడులు లేదా ఎటువంటి నేరానికి పాల్పడినా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి, మిస్సింగ్, మహిళల సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారులకు భరోసా కల్పిస్తూ, సంబందిత అధికారులతో వెంటనే
ఫోన్ లో సంభాషించి పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్స్, నర్స్, సిబ్బంది పై దాడులు జరగుకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని టౌన్ డియస్పి కి ఆదేశాలు జారీ చేసారు.స్పందన కార్యక్రమానికి యస్పి తో పాటు అడిషనల్ యస్.పి. (క్రైమ్స్) పి.మనోహర్ రావు, నెల్లూరు టౌన్ డియస్పి జె.శ్రీనివాస రెడ్డి, రూరల్ డియస్పి కె.వి.రాఘవ రెడ్డి, యస్.బి. డియస్పి యన్.కోటా రెడ్డి హాజరుగా ఉన్నారు.