భూమి వివాదములో ఘర్షణ ఒకరికి గాయాలు

రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం :- మండల పరిధిలోని మామిళ్లపాడు గ్రామంలో శనివారం రాత్రి భూమి వివాదంలో ఘర్షణ చోటుచేసుకుని సంచి పెంచలయ్య అని అతనికి గాయాలయ్యాయి వివరాలు మేరకు సంచి పెంచలయ్యకు మరియు అదే గ్రామానికి చెందిన బట్ట నాగరాజు వారి కుటుంబాలకు మధ్య గత కొంతకాలం నుంచి ఈ భూ వివాదము జరుగుతూ ఉన్నది ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఈ భూవివాదం జరగడంతో ఘర్షణగా మారడంతో బట్ట నాగరాజు చంద్రయ్య వెంకటయ్య కాటూరు దశరదయ అను ఐదుగురు సంచి పెంచలయ్య పై దాడి చేసి గాయపరిచినట్లు పెంచలయ్య తెలిపారు గాయపడిన పెంచలయ్య గూడూరుకు వెళ్లి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై తిరుమల రావు విచారించడం జరుగుతుంది అని పోలీసులు తెలిపారు