నగర డిఎస్పీ సింధు ప్రియా వెల్లడి
ఘరానా దొంగ అరెస్ట్
* 52 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం
* నగర డిఎస్పీ సింధు ప్రియా వెల్లడి
నెల్లూరు క్రైం మేజర్ న్యూస్.
బంగారు ఆభరణాలను అమ్మి పెట్టాలని చెప్పిన వ్యక్తి నుంచి.. ఆ బంగారాన్ని దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఘరానా దొంగను చిన్న బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.52 లక్షలు విలువ చేసే 660 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర డిఎస్పీ సింధుప్రియ తెలిపారు. శుక్రవారం డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నెల్లూరు వాకర్స్ రోడ్డుకు చెందిన షేక్ జాకీర్ వెంకటేశ్వరపురం కు చెందిన ముజాఫర్ వద్ద ఉన్న బంగారాన్ని దొంగలించి తనకు ఏమీ తెలియనట్లు బుకాయించాడని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘరానా దొంగను అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పి చెప్పారు. అతని వద్ద నుంచి రూ.52 లక్షల విలువచేసే 660 గ్రాముల బంగారు నెక్లెస్లు , హారంలను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి పేర్కొన్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు, ఏఎస్ఐ శ్రీహరి , సిబ్బంది పాల్గొన్నారు.