నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సందేశం

 నెల్లూరు, డిసెంబర్‌ 25, (రవికిరణాలు) : క్రిస్మస్ ప్రపంచవ్యాప్త పండుగని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు క్రిస్మస్ పండుగ సందర్భంగా వైసిపి సీనియర్ నేత స్వర్ణ వెంకయ్య క్రిస్మస్ సందర్భంగా బుధవారం వెంగళ్రావు నగర్లో భారీ ఎత్తున ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని విశిష్ట అతిథిగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు ప్రపంచమంతా శాంతి నిండాలని కోరుకుంటారని తెలిపారు క్రైస్తవం అంటే శాంతికి ప్రతిరూపం అని కొనియాడారు శాంతి దూతగా ఏసుప్రభు కరుణాకటాక్షాలు అందరిపై  ప్రసరించాలని
అభిలషించారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవుల శాంతి ప్రార్థనలు ఫలించి సమాజం మొత్తం సుఖశాంతులతో నిండి పోవాలని అభిలషించారు. స్వర్ణ వెంకయ్య తన ఆర్థిక స్థోమతకు మించి గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఇది ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత కాలం కొనసాగించేందుకు దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు చేకూర్చాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కొన్ని వందల మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆహుతులు అందరు కూడా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ
కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులకు వెంకయ్య ఘన సన్మానం చేసి  జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగ తో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, అది సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమ నిర్వాహకులు స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ జిల్లాలో అభిమాన ధనుడు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ప్రశంసించారు. గత ఎంపీలకు భిన్నంగా ఆయన పార్లమెంటులో ఎన్నో విషయాలు ప్రస్తావించి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వెంగళ్ రావు నగర్ లో తాను చేసిన ప్రగతిని ఆయన వివరించారు. అంతకుముందు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి క్రిస్మస్ కేక్ను కట్ చేసి స్వర్ణ వెంకయ్యకు తినిపించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఇన్చార్జి గిరిధర్ రెడ్డి వై.వి రామిరెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, అబూబకర్, మధు, పాముల హరి, ఝాన్సీ, నరసింహారావు, డాక్టర్ సునీల్, బుర్ర వెంకటేశ్వర గౌడ్, మేఘన సింగ్, అల్లా బక్షు, హజరత్ నాయుడు, పాల కీర్తి, రవి, స్వర్ణ, నాని, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో విచ్చేసిన పేదలకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొన్ని దశాబ్దాలుగా నిర్వహించడం స్వర్ణ వెంకయ్యకే చెల్లిందని వక్తలు కొనియాడారు. అంతకుముందు మైనార్టీ నేత అబుబకర్ తనయుడు సయీద్ నవాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ చిరంజీవికి కేక్ తినిపించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నర్సింలు గౌడ్ అధ్యక్షత వహించారు.