ఎమ్మెల్యే వెలగపల్లి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చిల్లకూరు



ఎమ్మెల్యే ని సన్మానించిన చిల్లకూరు  దశరథ రామిరెడ్డి ని సత్కరించిన ఎమ్మెల్యే వెలగపల్లి  పనిచేసే ఎమ్మెల్యే దొరకడం అదృష్టం   అందరివాడు ఎమ్మెల్యే వెలగపల్లి   ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టం: చిల్లకూరు 

గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు అని,అలాంటి గొప్ప నేత గూడూరు ఎమ్మెల్యే అవ్వడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిల్లకూరు దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గూడూరు పట్టణంలోని సొసైటీ కాలనీ లో ఉన్న ఎమ్మెల్యే స్వగృహానికి చిల్లకూరు దశరథ రామిరెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ నాయులతోకలిసి మర్యాద పూర్వకంగా  ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు కు శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా చిల్లకూరు దశరథ రామిరెడ్డికి ఎమ్మెల్యే శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దశరథరామి రెడ్డి మాట్లాడుతూ  తిరుపతి ఎంపీగా గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి 2019 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 47 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి జిల్లాలో గూడూరు  నియోజకవర్గం రికార్డు సృష్టించింది అని తెలిపారు. ఎమ్మెల్యే గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు అని తెలిపారు. ఇలాంటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనిచేయడం తన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి,వజ్జా రామ చంద్ర రెడ్డి,వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు.