అటవీశాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందన లు
అటవీశాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందన లు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ సిబ్బంది కి అభినందన లు తెలిపారు. గురువారం ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్. ప్రతీప్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్ నేతృత్వంలో 1992, 1997, 2004, 2008,2013
బ్యాచ్ లకు సంబంధించి న ఐఎఫ్ఎస్ అధికారులకు సకాలంలో జనవరి నెల లో పదోన్నతి లభించిన సంధర్భంగా అధికారులు ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయంలో సీయం వైఎస్ జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా పచ్చదనం పెంపు లో ఆంధ్రప్రదేశ్ అగ్ర గామి గా నిలిచిన విషయంలో తమ సిబ్బంది పనితీరు ను పీసీసీఎఫ్ ఎన్. ప్రతీప్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. భారత దేశ చిత్ర పటంలో పచ్చదనం పెంపు లో ఆంధ్రప్రదేశ్ అగ్ర భాగాన నిలవడం పట్ల సీయం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ -2021 ప్రతి రెండు సంవత్సరాల కొకసారి వెల్లడిస్తారు. ఇదే పనితీరును భవిష్యత్తు లో కూడా పచ్చదనం పెంపు విషయంలో కొనసాగించాలని ఆయన సూచించారు.
. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-21 విడుదల చేసిన జాబితాలో భారత దేశం లో అన్ని రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచినట్లు ఇటీవలే భారత అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు .647 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగినట్లు ఆ రిపోర్ట్ లో వెల్లడించారు. 2019 సర్వే రిపోర్ట్ కన్నా గ్రీన్ కవర్ పెంపు లో పెరుగుదల కనిపించడం తో భారత అటవీ మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణా ద్వితీయ స్థానంలో ఒడిషా మూడో స్థానంలో నిలిచింది. పచ్చదనం పెంపు విషయంలో గతంలో మొదటి, రెండవ స్థానాలలో నిలిచిన ఏపీ ఈ యేడాది మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పనిచేయడం , అంకిత భావం వల్లనే ఇది సాధ్యమైందని ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్. ప్రతీప్ కుమార్ తెలిపారు. అదే విధంగా భవిష్యత్తు లో కూడా పచ్చదనం పెంపు విషయంలో తమ సిబ్బంది మరింత ఎక్కువ కృషిచేసి ఆంధ్ర ప్రదేశ్ ను నంబర్ వన్ స్థానంలో నిలబెడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్- 2021..22 ఆంధ్ర ప్రదేశ్ లో ప్రోగ్రస్ గురించి కూడా సీయం వైఎస్ జగన్ కు వివరించారు. దేశవ్యాప్తంగా ప్రతి నాలుగేళ్ల కొకసారి పులుల గణన చేస్తారు. ఈ సంధర్భంగా ఐఎఫ్ఎస్ అధికారులకు సకాలంలో పదోన్నతులు కల్పించిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రతీప్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.